‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’తో మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రభాస్

  • 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' యానిమేటెడ్ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ అప్‌డేట్
  • ప్రతిష్ఠాత్మక యానెసీ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక
  • సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను పంచుకున్న ప్రభాస్
  • చిత్ర బృందం అద్భుతమైన ప్రాజెక్ట్‌ను రూపొందిస్తోందని ప్రశంస
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన బాహుబలి చిత్రానికి సంబంధించిన ఒక సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు. 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' పేరుతో వస్తున్న యానిమేటెడ్ చిత్రం, ఫ్రాన్స్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక యానెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026కు ఎంపికైందని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ ఫెస్టివల్‌లోని 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' సెషన్‌లో తమ చిత్రం ప్రదర్శనకు ఎంపిక కావడంపై ప్రభాస్ ఆనందం వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో "బాహుబలి: ది ఎటర్నల్ వార్ చిత్రం యానెసీ ఫెస్టివల్‌కు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. చిత్ర బృందం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్‌ను రూపొందిస్తోంది" అని ప్రశంసించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడు చూస్తారా అని తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రభాస్ పేర్కొన్నారు. బాహుబలి ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ఈ యానిమేటెడ్ చిత్రం, విడుదల కాకముందే అంతర్జాతీయ గుర్తింపు పొందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు, బాహుబలి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Prabhas
Baahubali The Eternal War
Annecy International Animation Film Festival
Baahubali Animated Movie
Annecy 2026
Baahubali Franchise

More Telugu News